- ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 6,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం (సి ఎ) ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎండి.సమీర్ అహ్మద్ అనే విద్యార్థి హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి, ధర్మ శాల లో జాతీయ స్థాయిలో జరిగే ఎన్ ఎస్ ఎస్ క్యాంపు కు ఎంపికైనట్లు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికయ్యే విధంగా శిక్షణ అందించిన ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1 బాలుర ప్రోగ్రాం ఆఫీసర్ బి కృష్ణ ప్రసాద్, విద్యార్ధి సమీర్ అహ్మద్ ని ప్రిన్సిపాల్ తో పాటు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందించారు. జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ప్రిన్సిపాల్ విద్యార్థికి సూచించారు. ఎంపిక అయినా విద్యార్ధి జనవరి 3, 2024 నుండి జనవరి 12, 2024 తేదీ వరకు కులు మనాలి, ధర్మ శాలలో జరిగే క్యాంపు లో పాల్గొనడం జరుగుతోందని ప్రోగ్రాం ఆఫీసర్ బి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాలా ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. గోదావరి, హిస్టరీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకం జయ ప్రకాష్, కామర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నూనె నాగనీక, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బుద్దె అరుణ్ కుమార్, ప్రభాకర్ రావు, గంగారెడ్డి, సిద్దు రాజు, కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి , అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.