సద్వినియోగం చేసుకోండి ఏఎస్పీ సంపత్ రెడ్డి వెల్లడి. నర్సాపూర్, ఆగస్ట్ 11:(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) సంగారెడ్డి డివిజన్ పరిధిలో ని అన్ని సబ్ పోస్ట్ ఆఫీస్ లు, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో జాతీయ జెండాలను విక్రయిస్తున్నామని ఏఎస్పీ సంపత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా గుమ్మడి దల ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఎంపీడీఓ శత్రునాయక్ ను కలిసి జాతీయ జెండాను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేవలం 25 రూపాయలకు మాత్రమే జాతీయ జెండాను అందజేస్తామని అన్నారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్ సబ్ పోస్ట్ ఆఫీసులో జెండాల విక్రయాలు: ఎస్పీఏం హరి ప్రసాద్ వెల్లడి. నర్సాపూర్ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని ప్రజా ప్రతినిదులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు చెందిన అధికారులు తమకు జాతీయ జెండాలు అవసరం అయితే పోస్ట్ ఆఫీస్ సమాచారం ఇస్తే అందించగలదని చెప్పారు. 9553356173 నెంబర్ కు పోన్ చేయగలరు.
పోస్ట్ ఆఫీస్ ల ద్వార జాతీయ జెండాల విక్రయాలు…!
28
previous post