బిచ్కుంద ఫిబ్రవరి 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకొని పెండింగ్ లో ఉన్న లేండి ప్రాజెక్టుకు పనులను త్వరగా పూర్తిచేసి జుక్కల్ నియోజకవర్గ భూములకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు కోరారు ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగు పరిచర్యలు తీసుకుంటా మని వారు పేర్కొన్నారు
