Home తాజా వార్తలు విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత రేవంత్ రెడ్డి దే.

విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత రేవంత్ రెడ్డి దే.

by Telangana Express

తెలంగాణ రైతు సంక్షేమ కమీషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి ప్రతినిధి డిసెంబర్ 14 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలంగాణలో వసతి గృహాలు చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచడం ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిటీ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు శనివారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సందర్శించి, కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

గత ప్రభుత్వం గురుకుల సమస్యలు పూర్తిగా మర్చిపోయిందని దుయ్యబట్టారు.
గురుకులంలో విద్యార్థులకు ముఖ్యంగా మంచినీటి సమస్య, సీసీ రోడ్డుకు ఇరువైపులా మట్టిని నింపుట క్రమాన్ని తెలపగా తక్షణమే పంచాయతీరాజ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అదనప గదుల నిర్మాణం కోసం కోరగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తారని అన్నారు. రెండు రోజుల్లో పాఠశాలలో నూతనంగా బోర్ వేయుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో మమేకమై సహం పత్తి భోజనం లో పాల్గొన్నారు. పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో , రాష్ట్ర జూ పార్క్ డైరెక్టర్ సునీల్, కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పాఠశాల కమిటీ అధ్యక్షుడు పోలేపాక రామచంద్రు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, పార్టీ మండల నాయకులు, నల్లు రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, కుమార్ యాదవ్, ఓ బి సి సెల్ జిల్లా నాయకులు రుద్ర రామచంద్రు, గుండగాని మహేందర్, అనుఖ్, కలకోట్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment