Home తాజా వార్తలు తెలంగాణ ఎక్స్ ప్రెస్ “వార్త” కు స్పందన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ “వార్త” కు స్పందన

by Telangana Express

*చిన్న అరుగు(పైపుల కాలువ) తొలగించిన మున్సిపల్ అధికారులు*

మిర్యాలగూడ డిసెంబర్ 24: (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ పట్టణ నడిబొడ్డున రోడ్డు ఆక్రమించి అరుగులా నిర్మాణం చేసిన మున్సిపల్ అధికారులు గాని ఆర్ అండ్ బి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని స్థానికులు వాపోతున్నారని *తెలంగాణ ఎక్స్ ప్రెస్* దినపత్రికలో మంగళవారం “వార్త” ప్రచురించడంతో మున్సిపల్ అధికారులు మంగళవారం స్పందించారు. రోడ్డు ఆక్రమ గురైన స్థలాన్ని కమిషనర్ ఎండీ యూసుఫ్ సందర్శించి వెంటనే అక్రమాలను తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. దీంతో
చర్చికు వెళ్ళే రోడ్డులో ప్రారంభంలో ఉన్న రాఘవ థియేటర్- శ్రీలత లాడ్జి మధ్య రోడ్డుపై శ్రీలత లాడ్జి యజమాని దక్షిణం వైపునా గోడ వెంట రోడ్డుపై సుమారు 2అడుగుల మేర ముందుకు వచ్చి చిన్న అరుగు(పైపుల కాలువ) నిర్మాణ పనులు చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. మున్సిపల్ సిబ్బంది అక్రమాలను తొలగించే ప్రక్రియ మంగళవారం చేపట్టారు. చిన్న అరుగు( పైపుల కాలువ) తొలగిస్తుండడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

You may also like

Leave a Comment