Home తాజా వార్తలు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం వైద్యారోగ్యమంత్రికి వినతి

డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం వైద్యారోగ్యమంత్రికి వినతి

by Telangana Express

( తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్16

మక్తల్, నియోజకవర్గంలోని ఊట్కూర్ కృష్ణ మాగనూర్ నర్వ అమరచింత ఆత్మకూర్  నియోజకవర్గంలోని పరిధిలోలలో ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి

మక్తల్ నియోజకవర్గ కేంద్రంతో పాటు ఆత్మకూరులోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి వినతిపత్రం అందించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో దామోదర్ రాజనర్సింహను కలిసి మక్తల్ నియోజవర్గంలో డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు సుమారు 100కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి డయాలసిస్ సేవలు పొందాల్సి వస్తుందని, ఇది డయాలసిస్ రోగులకు చాలా ఇబ్బందిగా మారిందని తెలియజేశారు. వెంటనే మక్తల్ ఆత్మకూరులలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించి, డయాలసిస్ రోగులకు ఉపశమనం కలిగించాలని విన్నవించారు. స్పందించిన వైద్యాలకు శాఖ మంత్రి… వెంటనే అధికారులను పిలిపించే మక్తల్ నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు కోసం కావాల్సిన చర్యలను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా డయాలసిస్ సెంటర్లు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

You may also like

Leave a Comment