Home తాజా వార్తలు రైతు సంక్షేమానికి రైతుబంధు విడుదల

రైతు సంక్షేమానికి రైతుబంధు విడుదల

by Telangana Express

కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాహెబ్ హుస్సేన్

వీణవంక, జనవరి 18( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్ గురువారం మాట్లాడుతూ.. రైతు సంక్షేమాన్ని కట్టుబడి రైతు బంధు విడుదల చేస్తుందని, రైతులెవ్వరు ఆందోళన పడవద్దని, ఆనాటి వైయస్సార్ నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు, పేదల పక్షాన నిలబడి , రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ సర్కార్, కొంత ఆలస్యమైనా ప్రతి రైతు అకౌంట్లో రైతుబంధు డబ్బులు జమచేస్తుందని, గురువారం నుండి రైతుబంధు డబ్బులు రైతు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నారని , ఇప్పటికే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అభయ హస్తం పేరిట ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరించామని, ఆన్లైన్లో వివరాలు పొందుపరచడం జరిగిందని, త్వరలోనే క్షేత్రపరిశీలన జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలోనే నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులు పారదర్శకత వహిస్తారని, ఎలాంటి ప్రలోభాలకు లొంగరని , సంక్షేమానికి సరైన సర్కారుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబోతుందని, రైతులకు కావలసిన సాగునీరు, విద్యుత్, రైతుబంధు పథకాలకు భరోసాలను కలిగిస్తుందని అన్నారు.

You may also like

Leave a Comment