Home తాజా వార్తలు భారతదేశ గణితం శాస్త్రి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్శతజయంత్యుత్సవాలు

భారతదేశ గణితం శాస్త్రి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్శతజయంత్యుత్సవాలు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 20/12/24
భైంసా మండలోని వాలేగాం ప్రాథమిక పాఠశాల లో శ్రీనివాసా రామానుజన్ జన్మదిన సందర్బంగా విద్యార్థులు గణిత శాస్త్రం గురించి ప్రదర్శన నిర్వహించి గణిత దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగినది.ముఖ్య అతిథులు భైంసా మండల యం ఈ ఓ సుభాష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చేసిన వివిధ రకాల గణిత ఆక్టివిటీస్ ప్రయోగాలను చూసి చాలా ఆనందముగ్దలైన్నారు.భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి.వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ.తీవ్రమైన అనారోగ్యంతో మంచానపడ్డప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆశ్చర్యపరిచారు. ఈ సంఘటన గురించి హార్డీ తన మాటల్లో ఇలా చెప్పారు: నేనోసారి రామానుజన్‌ను చూసేందుకు ట్యాక్సీలో వెళ్లాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడటానికి డల్‌గా కనిపిస్తోంది.. ఇది దుశ్శకునమేమీ కాదుగదా అని అన్నాను. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు.. ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య.. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నదని ఈ విధంగా విశదీకరించారు 1729 = 103+93 = 123+13. వీటిని ట్యాక్సీక్యాబ్ సంఖ్యలు అని పిలుస్తారు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు సోనియా, కవిత, లక్ష్మణ్, గ్రామ సెక్రటరీ పోతన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment