Home తాజా వార్తలు వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో రఘువీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. రక్తదాన శిబిరం

వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో రఘువీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. రక్తదాన శిబిరం

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 2 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
జనహృదయనేత, పేదల పక్షపాతి, యువనేత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( టిపిసిసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మిర్యాలగూడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొదిలే వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్ కనకదుర్గ దేవాలయం వద్ద మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి టీపీసీసీ మాజీ సభ్యులు పగిడి రామలింగ యాదవ్, మిర్యాలగూడ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కన్వీనర్ ఇంజుమూరి లలిత సమక్షంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్, సీనియర్ నాయకులు రాజశేఖర్, నకిరేకంటి నారాయణ, బొంగరాల కిరణ్, దావీద్, అజయ్, కడారి క్రాంతి, పోలోజు నవీన్ కుక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment