Home తాజా వార్తలు రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు

రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు

by Telangana Express

*5,293 మంది రైతుల నుంచి 2,61,665.6 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేశాం*…
*60 కోట్ల 70 లక్షల 64 వేల 190 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ*…
*కొనుగోళ్లు పూర్తి*….
     – *ఎల్లారెడ్డి, వెల్లుట్ల, మత్తమాల సొసైటిల ఛైర్మన్ లు*

ఎల్లారెడ్డి, డిసెంబర్ 25,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి (17), వెల్లుట్ల (7), మత్తమాల (3), సొసైటిల వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మొత్తం 27 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 5,293 మంది రైతుల నుంచి 2,62,665.6 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఎల్లారెడ్డి, వెల్లుట్ల, మత్తమాల సొసైటీల చైర్మన్ లు ఏగుల నర్సింలు, పటేల్ సాయిలు , కాసాల శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు… ఖరీఫ్ సీజన్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని *ఎల్లారెడ్డి సొసైటి పరిధిలోని* ఎల్లారెడ్డి, గండి మాసానిపెట్, లింగారెడ్డి పేట్, శివ్వానగర్, మీసాన్పల్లి, మీసాన్ పల్లి 2, లక్ష్మాపూర్, అడివిలింగాల్, భిక్కనూర్, తిమ్మాపూర్, శివ్వాపూర్, మాచాపూర్, సబ్దల్ పూర్, కళ్యాణి, సోమర్యాగడి తాండా, సాతొల్లి, సొమార్ పేట్, కొక్కొండ  కలిపి మొత్తం 17 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 3,236 మంది రైతుల నుంచి 1,60,690.80  క్వింటాళ్ల  వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, మొత్తం మంది రైతులకు సంబంధించిన 1,60,690.80 క్వింటాళ్ల కు సంబంధించి ధాన్యం విక్రయం తాలూకు వివరాలు ట్రక్ షీట్ ఆధారంగా, ట్యాబ్ లో నమోదు చేసి మొబైల్ నంబర్ ఆధార్ లింక్ అప్ ఉన్న నంబర్ కు ఓటిపి పంపించి, 37 కోట్ల 28 లక్షల 02 వేల 656 రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ధాన్యం  కొనుగోలు కేంద్రాల ద్వారా  ధాన్యాన్ని కొనుగోలు చేయడం పూర్తి అయ్యింది అని సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు తెలిపారు.

*వెల్లుట్ల సొసైటి*….

వెల్లుట్ల సొసైటి పరిధిలోని అన్నా సాగర్, అన్నసాగర్ 2, ఆజామాబాద్, తిమ్మారెడ్డి, వెల్లుట్ల , వెల్లుట్ల పేట్, వెంకటాపురం  కలిపి 7 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,254 మంది రైతుల నుంచి 65,246.40 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయగా, అంత మంది రైతుల  ధాన్యం తాలూకు డబ్బులు 15 కోట్ల 13 లక్షల 71 వేల 648 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని  అన్నారు. కొనుగోలు పూర్థైయ్యిందని సొసైటీ ఛైర్మన్ పటేల్ సాయిలు తెలిపారు.

*మత్తమాల సొసైటీ*…

మత్తమాల సొసైటి పరిధిలోని మత్తమాల, రుద్రారం , జంగమాయిపల్లి కొనుగోలు కేంద్రాల ద్వారా 803 మంది రైతుల నుంచి 35,728.40 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అంత మందికి సంబంధించి ధాన్యం తాలూకు డబ్బులు 8 కోట్ల 28 లక్షల 89 వేల 888 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు పూర్తి అయ్యిందని చైర్మన్ కాసాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొత్తం 3 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,293 మంది రైతుల నుంచి 2,61,665.6 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ధాన్యం తాలూకు  60 కోట్ల 70 లక్షల 64 వేల 190 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తానికి 3 సొసైటీ ల పరిధి లో కొనుగోళ్లు పూర్తి అయ్యాయని సొసైటి ల చైర్మన్ లు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి, మత్తమాల సొసైటి సీఈఓ లు విశ్వనాథం, పవన్, సిబ్బంది మల్లేష్, సత్యం, సాయిబాబా,  తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment