బోధన్ రూరల్,జనవరి 4:(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తోందని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని 31,33,35 వార్డ్ లలో కోనసాగుతున్న ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డిఈ శివానందం, కౌన్సిలర్ లు శరత్ రెడ్డి,పిట్ల సత్యం,అధికారులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీ పథకాల అమలు కోసమే ప్రజా పాలన
60
previous post