Home తాజా వార్తలు జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ జడ్చర్లలో నిరసన. సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం

జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ జడ్చర్లలో నిరసన. సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ప్రెస్ మహబూబ్నగర్ డిసెంబర్11 :
వార్తను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ జడ్చర్లలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా లో సిగ్నల్ గడ్డ వద్ద టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో నిరసన తెలియపరిచారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికే విరుద్ధమని, దాడి చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను జనాలకు చూపించేందుకు తాపత్రయ పడుతున్న జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, నియోజకవర్గం జర్నలిస్టులు అందరూ కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు చేరుకొని సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎడ్ల బాబయ్య, రాచాల నరేందర్ గౌడ్, మానే శశికాంత్, రవీందర్ గౌడ్, శ్రీధర్, డేవిడ్ ,అమర్, దాస్, మల్లేష్, శేఖర్ ,జైపాల్, కాజా, హైదర్ అలీ ,అబ్దుల్లా, కిరణ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment