అసాంఘిక శక్తుల కట్టడి కోసం గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్
మంచిర్యాల, జూన్ 20, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) జన్నారం:- ప్రజలకు మీ రక్షణ, భద్రత గురించి ఎల్లప్పుడూ అందుబాటులో, చట్టపరిధిలో మీ సమస్యలు పరిష్కరిస్తూ పోలీసులు ప్రజల కోసం ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పిస్తూ, అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్* కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ రూపొందించారు. ప్రజలకు చట్టం ప్రకారం న్యాయం చేరడానికి రక్షణలో భాగంగామొట్ట మొదటి సారిగా మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, ఐపిఎస్ ఐజి ఆదేశాలు మేరకు మంచిర్యాల సబ్ డివిజన్ ఎసిపి ప్రకాష్, లక్షెట్టిపేట్ సీఐ అల్లం నరేందర్ పర్యవేక్షణలో జన్నారం ఎస్ఐ రాజవర్ధన్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం రాత్రి చింతగూడ గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జన్నారం ఎస్ఐ గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా మెలగాలన్నారు. ఘర్షణలకు పాల్పడకుండా స్నేహ భావంతో ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. యువతను ఉద్దేశిస్తూ గంజాయి, ఇతర ఆసాంఘిక కార్యక్రమాల జోలికి పోయి యువత తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా అడ్డుకట్ట వేయడానికి గ్రామస్థులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా యవత అసాంఘిక కార్యకలాపాలపైపు పెడదారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరించారు, గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాట్ల ఆవశ్యకత వివరించారు. జైలు నుంచి విడుదలై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై నిఘా ఉంచడం జరుగుతుంది. గ్రామాల్లోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్ కి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు, జన్నారం ఎస్ఐ రాజ వర్ధన్ తెలియజేశారు.