Home తాజా వార్తలు ఎస్సీ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలను కల్పించాలి

ఎస్సీ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలను కల్పించాలి

by Telangana Express

ముధోల్:22డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎస్సీ వసతి గృహాల్లో సరైన సౌకర్యా లు కల్పించే విధంగా చూడాలని ఎస్ ఎఫ్ఐ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు గ డపాలే పరమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన ముధోల్ లోని ఎ స్సీ వసతి గృహాన్ని ఆయన సందర్శిం చారు .ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిం చేందుకు సాంఘిక సంక్షేమ వసతి గృ హాల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా సరైన భవనాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రని పేర్కొన్నారు. అద్దె భవనాల్లోనే వసతి గృహాల నిర్వహణ ఉండడంతో సుమారు 70 మంది విద్యార్థులకు గదులు లేక ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకర విషయం అన్నారు.విద్యార్థులకు రోజువారి భోజనంలో నాణ్యత పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో నితిన్, దేవేందర్ తదితరులు ఉన్నారు

You may also like

Leave a Comment