ప్రతి రోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలి…
– కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం
ఎల్లారెడ్డి , డిసెంబర్ 6,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికా బద్దంగా సిద్దం చేయాలని, కామారెడ్డి జిల్లా ఇంటర్మీడి యట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముందుగా అధ్యాపకులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఆతర్వాత అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రగతి వివరాలను, విషయాల వారీగా పాఠ్యాంశాలు ఎంత వరకు పూర్తి చేశారు అనే వివరాలను అడిగి తెలుసు కున్నారు. పిదప అధ్యాపకుల సందేహాలను నివృత్తి చేస్తూ, తగిన సూచనలు సలహాలు అందజేశారు. ద్వితీయ సంవత్సర సైన్స్ , మ్యాథ్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలకు సంబంధిత అధ్యాపకులు సన్నద్ధం చేయాలని, వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెంచడాని కోసం విద్యార్థులకు స్టడీ అవర్స్ ప్రతి రోజూ కొనసాగిస్తూ, స్లిప్ టెస్ట్ లు నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క ప్రగతిని ఎప్పటి కప్పుడు గమనిస్తూ వారి అభివృద్ధికి కృషి చేయాలని అధ్యాపక బృందానికి సూచించారు. పిదప తరగతి గదుల్లో వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. చదువు నేర్పే గురువులను గౌరవించాలని, లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. జీవితంలో ఉన్నత స్థితిని పొందడానికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో ముఖ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గణేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారి, అధ్యాపకులు రమేష్, సాయిలు, రాములు, నాగయ్య, పి.సాయులు, రాధ, గౌతమి, అనూష, సునీత, జ్యోతి, అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు.