ధర్మకర్తలు పరిపాటి వేణుగోపాల్ రెడ్డి, పరిపాటి పవన్ కుమార్ రెడ్డి…
వీణవంక, ఫిబ్రవరి 22( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గతంలో మాదిరిగా , సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని జాతర ధర్మకర్తలు పరిపాటి వేణుగోపాల్ రెడ్డి, పరిపాటి పవన్ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ.. జాతర కు వచ్చేటువంటి భక్తులు సౌకర్యార్థం విద్యుత్, వైద్య సదుపాయం, త్రాగునీరు, ప్రక్కనే స్నానం చేయడానికి అణువుగా చెక్ డ్యామ్ లో నీరు పుష్కలంగా ఉందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని సౌకర్యాలతో కూడిన నిర్వహణ ఉంటుందని, జాతరకు పరిపాటి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో, బుధవారం సాయంత్రం కోయ పూజారుల చేత అంగరంగ వైభవంగా సారలమ్మను గద్దెకు తీసుకొని రాగా, గురువారం సమ్మక్క ఆగమనం అంగరంగ వైభవంగా జరుగుతుందని, చుట్టుపక్కల గ్రామాలైన హిమ్మత్ నగర్, కొండపాక, వెంకటేశ్వర పల్లి, విలాసాగర్, కోరపల్లి, రాయపల్లి గ్రామ భక్తులు జాతరకు రానున్నారని, భక్తులకు ఆహ్లాదాన్ని నింపే వాతావరణం లో సమ్మక్క- సారలమ్మ జాతర కన్నుల పండుగ జరుగుతుందని, జాతర ధర్మకర్తలు పరిపాటి వేణుగోపాల్ రెడ్డి, పరిపాటి పవన్ కుమార్ రెడ్డి, పరిపాటి కుటుంబ సభ్యులు భక్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పరిపాటి వేణు గోపాల్ రెడ్డి, పరిపాటి పవన్ కుమార్ రెడ్డి, కర్ర శ్రీనివాస్ పటేల్,ఓల్లాల శ్రీకాంత్,గజ్జెల శ్రీకాంత్,రాపర్తి అరవింద్,రాపర్తి సాయి తేజ,రాపర్తి శ్రీనివాస్, తిప్పని సందయ్య తదితరులు పాల్గొన్నారు.