ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె ప్రశాంత్ గౌడ్
వీణవంక, నవంబర్ 2 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో గురువారం బి ఎస్ పి పార్టీ మండల అధ్యక్షులు కొంగల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిఎస్పి పార్టీ కార్యాలయాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె ప్రశాంత్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.అనంతరం అంబేద్కర్,మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలవేసి ,వారు మాట్లాడుతూ… బీఎస్పీ పార్టీతోనే బహుజనులకు అధికారం సాధ్యమవుతుందని, బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు నమ్మడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని,ఎలక్షన్ సమయంలోనే హామీలు ఇస్తూ, తదుపరి హామీలన్నింటిని, తుంగలో తొక్కేస్తున్నారని, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధిని సాధించిన, ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రవేశ పెడుతూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, బీఎస్పీ పార్టీలో కి విద్యావేత్తలు, మేధావులు వస్తున్నారని, హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని, బీఎస్పీ కార్యకర్తలు క్రమ శిక్షణతో గ్రామ గ్రామాన బహు జనుల అధికారం కొరకు ప్రచారం చేస్తూ, ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా ఇంచార్జ్ మేకల రవీందర్, జిల్లా మహిళా కన్వీనర్ మిడిదొడ్డి స్వప్న, నియోజకవర్గ ఇన్చార్జ్ వాసాల రామస్వామి, మండల అధ్యక్షులు కొంగల కుమార్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు మూగల శేఖర్, ప్రధాన కార్యదర్శి సాదుల పవన్, కార్యదర్శి మంతెన సంపత్ తదితరులు పాల్గొన్నారు.
