Home తాజా వార్తలు నకిలీ విత్తనాల విక్రయం, సరఫరా పై పోలిస్ ప్రత్యేక నిఘా

నకిలీ విత్తనాల విక్రయం, సరఫరా పై పోలిస్ ప్రత్యేక నిఘా

by Telangana Express

నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

పిడి యాక్ట్ తప్పదని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్

మంచిర్యాల, ఫిబ్రవరి 17, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రామగుండం సిపి ఎం శ్రీనివాసులు ఐపిఎస్ ఆదేశాల మేరకు, నకిలీ విత్తనాల విక్రమ్ సరఫరాపై పోలీస్ ప్రత్యేక నిఘా ఉంటుందని, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. శనివారం నేన్నెల్, భీమిని పోలీస్ స్టేషన్ ను, సందర్శించి, నకిలీ విత్తనాలు సరఫరా చేయకూడదని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను బెల్లంపల్లి ఏసిపి తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు సరపర చేసే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పిడిఎఫ్ చేయడం జరుగుతుందని అన్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జాలోద్దీన్ లతో కలిసి నెన్నెల్, భీమిని పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించి 5ఎస్ అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ను, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన కేసుల, పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని సీఐ, ఎస్ఐ లకి సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నందు 5ఎస్ ఫంక్షన్ వర్టీకల్స్ అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో వర్టికల్స్ వారిగా వారి విధులు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదు అవుతున్నాయో ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బంది కి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్నాయని, తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. గుడుంబా, గంజాయి, నకిలీ విత్తనాల తయారీ అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. సిబ్బంది అందరూ బాధ్యతయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని,పోలీస్ కి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ లపరిధిలో నకిలీ విత్తనాల విక్రయం మరియు అక్రమ రవాణా చేస్తూ రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పీడీ యాక్ట్ పెడతామని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ గారు హెచ్చరించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసిన పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ లో నకిలీ విత్తనాల సరఫరా, ఉత్పత్తి, ఎవరైన వ్యాపారులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే ప్రజలు కూడా పోలీసు వారికి సహకరిస్తూ, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు తమ గ్రామాలలో జరిగినట్లయితే అట్టి సమాచారం కూడా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జాలోద్దీన్, భీమిని ఎస్ఐ ప్రశాంత్, నేన్నల్ ఎస్ఐ శ్యామ్ పటేల్,ఉన్నారు.

You may also like

Leave a Comment