బిచ్కుంద జనవరి 16:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చించెల్లి అశోక్ కుమార్తె గంగోత్రి కి పోచంపాడు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు (25000/-) ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అందచేశారు.
గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసించి చక్కని ప్రతిభ కనబరిచి ప్రస్తుతం నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నందున గంగోత్రి కి పోచంపాడు గురుకుల పాఠశాల పదవతరగతి 1994 బ్యాచ్ పూర్వ విద్యార్థులoదరి సహకారంతో ఈ స్కాలర్షిప్ అందజేసినట్లు పోచంపాడు గురుకుల పూర్వ విద్యార్థుల ప్రతినిధి రచ్చ శివకాంత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పూర్వ విద్యార్థులు రచ్చ శివకాంత్, దుర్గాప్రసాద్, అశోక్, హన్మంతరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.