Home తాజా వార్తలు బైంసా మార్కెట్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మూసుకొని నిరసన తెలిపిన ప్రజా సంఘాలు

బైంసా మార్కెట్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మూసుకొని నిరసన తెలిపిన ప్రజా సంఘాలు

by Telangana Express


తెలంగాణ ఎక్స్ ప్రెస్ 26/02/24
భైంసా. మండలము కేంద్రం లోని
నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంట్లో కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురమ్మంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రైతు పోరాటం పై కాల్పులు జరిపి ఒక రైతును బలిగొన్నది .
ఈ చర్యను నిరసిస్తూ ఈరోజు భైంసా మార్కెట్లో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో నోరు మూసుకొని నిరసన తెలపడం జరిగింది .
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వెంటనే ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూ కనీసం మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది .చనిపోయిన రైతు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్ ,చందుల సాయి కిరణ్ ,సాజిద్ భేగ్ తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో

డాకూర్ తిరుపతి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు

You may also like

Leave a Comment