నిజాంసాగర్ జూలై 27,( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ మంజీరా పరివాహ ప్రాంతంలో ప్రజలు వెళ్లవద్దని నిజాంసాగర్ ప్రాజెక్టు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సొలొమాన్ అన్నారు. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈ విలేకరులతో మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో భారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి ,మంజీర నదిలోకి నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మంజీరా పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగానే సమాచారం అందిస్తున్నామన్నారు.
గ్రామాలలో ప్రజలకు అప్రమత్తం చేసేందుకు రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే గ్రామాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించామని తెలిపారు. గ్రామాలను ప్రజలకు అప్రమత్తం చేయాలని ప్రజా ప్రతినిధులు, రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులను కోరారు.