మాగనూరు .జూలై. 26 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు వడ్వాట్ మాజీ. సర్పంచ్ జి రవీందర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మాగనూరు మరియు పరిసర గ్రామ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి…వేడి చేసిన నీటినే త్రాగండి,.నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడకండి…సీజనల్ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి….వ్యవసాయ క్షేత్రంలో,విష సర్పాల పట్ల జాగ్రత్త వహించండి…కరెంట్ స్తంభాలను తాకకండి,విద్యుత్తు పట్ల అప్రమత్తంగా ఉండండి….తల్లితండ్రులు పిల్లలను బయటికి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు…తల్లిదండ్రులు చిన్న పిల్లల ఆరోగ్యం మీద ఎప్పటికి అప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు …వ్యవసాయ పొలాల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలని కోరారు…ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని సూచించారు….
ఈ రెండు మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..వడ్వాట్ మాజీ .సర్పంచ్ జి రవీందర్
32