నర్మెట్ట, జులై 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): గత రెండు రోజుల నుండి పడుతున్న వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను, రైతులను పరామర్శించిన డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మెట్ట,తరిగొప్పుల మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. రానున్న మరో రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జనగామ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలోనీ వాగులు ,చెరువులు పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు అలాంటి చోటుకి వెళ్లకూడదని పేర్కొన్నారు. తడిసిన విద్యుత్ పరికరాల పట్ల విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలను తాకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోనూ పాత ఇండ్లలో ఉన్న వారిని గుర్తించి సురక్షిత ప్రదేశంలో ఉంచాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్యయం చేసుకోవాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగులు,చెరువుల వద్ద తగు హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలేవ్వరు కూడా బయటకు రావద్దని కోరారు.
భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహా రెడ్డి
31