ఘట్కేసర్,నవంబర్ 05(తెలంగాణ ఎక్స్ ప్రెస్)రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని, మేడ్చల్ నియోజవర్గ అభివృద్ధికి పాటు పడిన మంత్రి మల్లారెడ్డి గెలుపు ఖాయమని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలో 3,4,5,11 వార్డులలో, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందడి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గడగడపకు మలన్న పేరుతో డప్పు చప్పులతో ర్యాలీగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ చామకూర మల్లారెడ్డితోనే మేడ్చల్ నియోజవర్గం అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల నాయకులు చెప్పిన మాటలు నమ్మవద్దని, అభివృద్ధి అంటేనే కేసీఆర్ అని గుర్తు చేశారు. మేడ్చల్ నియోజవర్గాన్ని మంత్రి ఎంతో అభివృద్ధి చేశారని, సొంత నిధులు సహితం వెచ్చించి అభివృద్ధి చేశారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్తితించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నానావత్ రెడ్యా నాయక్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, కౌన్సిలర్లు చింతల రాజశేఖర్, బెజ్జంకి హరిప్రసాద్ రావు, నల్లవెల్లి లక్ష్మీ, కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ అలీ, నాయకులు బద్దం జగన్ మెహన్ రెడ్డి, నర్రి కాశయ్య, అబ్బవతి నర్సింహా, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, నానాత్ ఉపేందర్ నాయక్, భైర ఐలయ్య, మోటుపల్లి శ్రీనివాస్, చక్రపాణి, జి.జేతందర్ నాయక్, ఉసికె రాఘవేందర్ రెడ్డి, మిసాల రాజేష్ కుమార్, అర్జున్ యాదవ్, సంతోష్ నాయక్, తిలక్ నాయక్, కరికం వెంకటేష్, బొక్క బుచ్చిరెడ్డి, నల్లవెల్లి మురళి, కార్తీక్, శ్రీనివాస్ రెడ్డి, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ తోనే – చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి
46