Home తాజా వార్తలు పాదచారిని డీ కొట్టిన లారీతీవ్ర గాయాలు

పాదచారిని డీ కొట్టిన లారీతీవ్ర గాయాలు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్
వెల్గటూర్ ఆగస్టు 23

వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నడుస్తూ వెళ్తున్న ఓ పాద చారిని లారీ ఢీ కొట్టగా అతడి కి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పాద చారి స్థంబంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. లారీ బలంగా ఢీ కొట్టగా దూరంగా ఎగిరి పడ్డ అతని తల పగిలి తీవ్ర రక్త స్రావం అయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని వెంటనే జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి స్తంభం పల్లి శివారులో బాతులు కాసుకొని జీవనం సాగిస్తాడని సమాచారం. అతడి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు డ్రైవరు ను అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తు న్నారు.

పోటో,లారీ ఢీకొట్టగా తీవ్రంగా గాయపడిన వ్యక్తి

You may also like

Leave a Comment