నాలుగు నెలలుగా నిర్వహించని జనరల్ బాడీ మీటింగ్
- పంచాయతీ నిధుల్లో అవకతవకలున్నట్టు అనుమానం వ్యక్తం
- పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చెయ్యాలి
- అభివృద్ధి పనులకు ఆమడ దూరం బిచ్కుంద ఆగస్టు 2 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల గ్రామ పంచాయతీ లొ సుమారు నాలుగు నెలల నుండి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం లేదని పంచాయతీ వార్డ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు కావడంతో ఏదో నామమాత్రంగా బాడీ మీటింగ్ నిర్వహించారని, ఇప్పుడు ఏకంగా గత నాలుగు నెలల నుండి గ్రామపంచాయతీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేదని, పంచాయతీ కి వచ్చిన నిధుల వివరాలు వార్డ్ సభ్యులు నిలదీస్తారని మీటింగ్ లకు దూరంగా వుంటున్నారని, తమ వార్డు లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, తాము సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి పనులు చేసిన బిల్లులు సహితం పెండింగ్ లొ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని రోజుల క్రితమే సర్పంచ్ కు చెకపవర్ తిరిగి రావటం తో సర్పంచ్ దృష్టికి తీసుకు వెళ్తామని వారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి హన్మంత్ రావు ని వివరణ కోరగా నాలుగు నెలలుగా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేదని, త్వరలోనే నిర్వాహస్తామని తెలిపారు.
చరవాణిలో పలువురు వార్డు సభ్యులతో సంప్రదించగా వారి సమస్యలను తెలంగాణ ఎక్స్ ప్రెస్ తో పంచుకున్నారు.