Home తాజా వార్తలు రాజురా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పోషకుల సమావేశం

రాజురా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పోషకుల సమావేశం

by Telangana Express

*పిల్లల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి ప్రొఫెసర్ సుశీల్ కుమార్ తివారి*

లోకేశ్వరం డిసెంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లోకేశ్వరం మండలంలోని రాజురా మండల ప్రజా పరిషత్ పాఠశాలలో శనివారం పోషకులు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ప్రొఫెసర్ సుశీల్ కుమార్ తివారీ సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోషకులతో సంభాషించారు.పిల్లలపై అనవసర లక్ష్యాలను రుద్దకూడదని వారిని స్వేచ్ఛగా ఎదగానీయాలని కోరారు.పాఠశాలలో జరిగిన పౌష్టిక ఆహార మెనూ పరిశీలించారు.ఈ క్రమంలో 1వ తరగతి చదువుతున్న పిల్లలతో మాట్లాడుతూ వారిలో మమేకమై వారిని మాట్లడిస్తు,నవ్విస్తూ విద్య ప్రవేశ్ లక్ష్యాలనుపరిశీలించారు.అనంతరం పిల్లలతో డ్రాయింగ్ వేయించారు.పాఠశాలలోని పరిశుభ్రతను, మధ్యహన భోజనాన్ని పరిశీలించారు.గ్రామస్తులు, పోషకులు సహకారాన్ని అభినందించారు.పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం  చేసి ప్రధానోపాధ్యాయులు జెడ్ల రాజేశ్వర్, ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఓ నర్సయ్య, ఎన్సిఆర్టీ ఎఫ్ఐ ముత్తన్న, ఏఏపీసి చైర్మన్ సరస్వతి,విడిసి చైర్మన్ ప్రవీణ్,మాజీ సర్పంచ్ ముత్తగౌడ్,మాజీ ఎంపీటీసీ నర్సవ్వ, పోతన్న, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సాయిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ముజాహిత్,ఉపాద్యాయులు,
విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment