Home తాజా వార్తలు పద్మశాలి సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పద్మ శ్రీకాంత్….

పద్మశాలి సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పద్మ శ్రీకాంత్….

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 17,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంలో కామారెడ్డి జిల్లా నుండి, రాష్ట్ర పద్మశాలి సంఘం జాయింట్ సెక్రటరీగా, ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎంపికయ్యారు. మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన
టి ఆర్ పీ ఎస్ (తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం) ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పద్మ శ్రీకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఎంపిక చేసిన రాష్ర్టఅద్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఎంపిక చేయడం పట్ల తన బాధ్యత మరింత పెరిగిందని, పద్మశాలి సంఘం అభివృద్ది కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.

You may also like

Leave a Comment