ఎల్లారెడ్డి, డిసెంబర్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు, ఆదివారం పట్టణానికి చెందిన అయ్యప్ప మాలాధార భూపాల్ స్వామి ఆయన ఫాం హౌస్ వద్ద కలుసుకుని అయ్యప్ప స్వామి ప్రసాదం అందజేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి అక్టోబర్ 28 న సువర్ణ భూమి మహా పాద యాత్ర , బాన్స్ వాడ గురువినయ్, వసంత్ గురుస్వా ముల అధ్వర్యంలో అయ్యప్ప మాల వేసుకుని పాదయాత్రగా 1400 కిలోమీటర్ల దూరంలోగల కేరళ రాష్ట్రంలోని శబరిమలకు చేరుకుని, అయ్యప్ప స్వామిని డిసెంబర్ 9 న దర్శించుకుని తిరిగి రావడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అందజేసినట్లు భూపాల్ స్వామి తెలిపారు.
