నిరుద్యోగుల పాలిట కల్పతరువు…
వీణవంక లైబ్రేరియన్ కనక లక్ష్మి …
వీణవంక, ఫిబ్రవరి 10( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోఉన్న గ్రంధాలయం అద్దె భవనంలో గత 12 సంవత్సరాల ఉండగా, రోడ్డు విస్తరణలో భాగంగా మరియు పాఠకుల కోరిక మేరకు, ఇటీవలే గ్రంథాలయాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశాల మేరకు శాఖ గ్రంధాలలోని పుస్తకాలని ఫర్నిచర్ ని ప్రభుత్వ పాఠశాల భవనంలోకి పుస్తకాలను ఫర్నిచర్ ను పాఠకులు కోసం మార్చడం జరిగినది. కావున పుస్తక ప్రియులు,ప్రతిదిన పాఠకులు దీనిని గమనించి, పాత జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో నడిపిస్తున్న గ్రంథాలయాన్ని అధిక సంఖ్యలో సందర్శించాలని,గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్కూల్ స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, రోజువారి న్యూస్ పేపర్ రీడర్స్ రాగలరు కోరుతున్నామని,మీకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు, డైలీ న్యూస్ పేపర్స్
అందుబాటులో ఉంటాయని వీణవంక లైబ్రరీ కనకలక్ష్మి తెలిపారు. లైబ్రరీ ని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లోకి మర్చినందుకు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, తహసీల్దార్ తిరుమల్ రావు,ఎంపీడీవో శ్రీనివాస్ , జడ్.పి.హెచ్.ఎస్ హెడ్మాస్టర్ అశోక్ రెడ్డి,గ్రామ సెక్రెటరీ రావూఫ్ లకు లైబ్రేరియన్ కనక లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, పాఠకులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ కనకలక్ష్మి, సెక్రటరీ రావూఫ్, పాఠకులు నరసింహస్వామి, కుమారస్వామి, అనిల్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.