– తెలుగు డైరీలను ముద్రించడం అభినందనీయమన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.
– హైదరాబాద్ బుక్ ఫేర్ లో శక్తిపీఠం డైరీ 2025 కొనుగోలు చేసిన ఎం ఎం కీరవాణి.
– ఇది తెలుసుకున్న పేటవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 25 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతైన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి నారాయణపేట శక్తిపీఠం నూతన డైరీ ని కొనడం ఆనందదాయకమని పేట పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో నారాయణపేట శక్తిపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బుక్ స్టాల్ ను బుధవారం నాడు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సందర్శించారు. శక్తిపీఠం ఆధ్వర్యంలో ముద్రించబడిన 2025 నూతన సంవత్సర తెలుగు డైరీలను ఆయన అక్కడి శక్తి పీఠం ఏర్పాటుచేసిన స్టాల్లో కొనుగోలు చేసినట్లు శక్తిపీఠం ఆఫీస్ వర్గాలు తెలియజేశాయి. మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా తితులతో పంచాంగ వివరాలు మన హిందూ పండుగల వివరాలతో కూడిన తెలుగు డైరీ ని ముద్రించడం అభినందనీయమని ఆయన స్టాల్ నిర్వాహకులను అభినందించారని పేట శక్తిపీఠం వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
