- కోర్టు న్యాయమూర్తి అటవీ అధికారులకు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష
మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని కలమడుగు చెక్పోస్ట్ వద్ద అటవీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రమాదంలో దుస్తూరబాద్ మండలం, గొడిసిరాల్ల గ్రామానికి చెందిన త్యాగేటి వినోద్ 24 మృతి చెందారు. కోర్టు న్యాయమూర్తి కలమడుగు చెక్పోస్ట్ వద్ద జరిగిన ప్రమాదానికి కారణమైన అటవీ అధికారులైన జాడి రాజన్న అసిస్టెంట్ బీట్ అధికారి, కందుకల రాజేందర్ వాచర్ లను ముద్దాయిలుగా ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించారు. పోలీసులు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 21/08/2017 లో జరిగిన కలమడుగు చెక్ పోస్ట్ వద్ద ఫిర్యాదు ప్రకారం వినోద్, నివాసం:గుడిసెరాల గ్రామం తన స్నేహితుడితో కలిసి వినాయక విగ్రహం తీసుకొని తిరిగి వస్తుండగా రాత్రి అందాజా 9:30 గంటల సమయంలో కలమడుగు వద్ద ఉన్నటువంటి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ముందుకు వస్తుండగా ఇద్దరు వ్యక్తులైనటువంటి జాడి అసిస్టెంట్ బీట్ అదికారి, కందుకల రాజేందర్, మరోక్క కారుని ఆపాలని తొందరలో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా చెక్ పోస్ట్ దండను వేగంగా కిందికి వేయడం వల్ల వినోద్ ప్రయాణిస్తున్న ట్రాలీ బేరింగ్ నెంబర్ టిఎస్01యుఎ 6602 సగం వరకు దండ మధ్యలో నిలిపివేయగా, చెక్ పోస్ట్ దండ తగిలి బలమైన గాయం తగిలి వినోద్ అక్కడికక్కడే మృతి చెందడనీ తేదీ 21/08/2017 దరఖాస్తు చేయగా జన్నారం ఎస్ఐ ఎం రమేష్ క్రైమ్ నెంబర్ 104/17 అండర్ సెక్షన్ 304 ఐపిసి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాడు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూట్ సహినా సుల్తానా లైజనింగ్ ఆఫీసర్ దస్తగిరి సిడిఓ పి రాజశేఖర్ ఆధ్వర్యంలో జడ్జ్ అసదుల్లా షరీఫ్ సాక్షులని విచారించి
ముద్దాయిలైన ఎ1 జాడి రాజన్న, ఎ2 కందుకూల రాజేందర్ లకు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందని, స్థానిక ఎస్ఐ తెలియజేశారు.