నాగిరెడ్డిపేట , జూలై 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన వడ్డెర చినరాజు (32)సం, చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఈత రాక మృతి చెందినట్లు స్థానిక ఏఎస్ఐ ఉమేష్ తెలిపారు.ఈనెల 23 రాత్రి ఇంట్లో భోజనం చేసి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేస్ చేయగా బుధవారం ఉదయం బొల్లారం గ్రామ ఊర చెరువులో శవమై నీటిపై తేలియాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శవాన్ని బయటకు తీసి శవం పూర్తిగా ఉబ్బి కుళ్ళిపోయి ఉండడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒకరి మృతి
51
previous post