Home తాజా వార్తలు ఈనెల 18 న అయ్యప్ప స్వాముల సామూహిక పడి పూజ …పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్…

ఈనెల 18 న అయ్యప్ప స్వాముల సామూహిక పడి పూజ …పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, ఈ నెల 18 న అయ్యప్ప స్వాముల సామూహిక మహా పడి పూజ నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయం ప్రాంగణంలో మొరం వేసి ట్రాక్టర్ డోజర్ ద్వారా చదును చేసే పనులను, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సామూహిక మహా పడిపూజను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అయ్యప్ప మాలాధార స్వాములు, భక్తులు, ప్రజలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని, అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గురుస్వామి కృష్ణారెడ్డి స్వామి, కోశాధికారి మురళీ గురు స్వామి, ప్యాలాల రాములు గురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment