Home తాజా వార్తలు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టిన వివిధ శాఖల అధికారులు

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టిన వివిధ శాఖల అధికారులు

by Telangana Express

లోకేశ్వరం ఫిబ్రవరి 2 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) లోకేశ్వరం గత నెల 31 తో సర్పంచుల పదవీకాలం ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులను నియమించాలని కోరగా లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్, కనుకపూర్, జోహార్ పూర్ గ్రామ పంచాయతీలకు ఏఈ, రఘు వంశీ. అర్లీ గుడిసెరా, నరసింహ నగర్ తండా, రాయపూర్ కె, గ్రామాలకు ఎమ్మార్వో మోతిరామ్, భామిని, గడి చందా, పిప్రి, గ్రామాలకు ఏవో గణేష్, మన్మద్, హవర్గా, డి డబ్ల్యు ఓ రమేష్. లోకేశ్వరం, పొట్టి పెళ్లి, నగర్, గ్రామాలకు ఎంపీడీవో సల్మాన్ రాజ్. బిలోలి, హద్గాం, సేవాలాల్ తండా, ఏఈ సుమన్, ధర్మోరా, వాట్టోలి, పంచగుడి, గ్రామాలకు ఆర్ఐ రవీందర్ నాయక్, రాజురా, బాగాపూర్, ఏ డి ఓ అంజి ప్రసాద్, కిష్టాపూర్, పుష్పూర్, సాధ్గం గ్రామాలకు వెంకట రమేష్ లను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి అలాగే ఈ రోజు ధర్మోరా గ్రామం లో ఆర్ ఐ రవీందర్ నాయక్, ని మంద భాస్కర్, నారాయణరెడ్డి, శాలువాతో సత్కరించారు

You may also like

Leave a Comment