ఎల్లారెడ్డి, డిసెంబర్ 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో, సోమవారం జిల్లా కేంద్రం నుంచి విడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్ నిర్వహించిన ప్రజావాణిలో స్థానిక తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ ఏ ఈ వినోద్, హెల్త్ సూపర్ వైజర్ రాజేశ్వరి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మండల పరిధిలోని ప్రజలకు ఏమైన రెవెన్యూ లేదా ఇతర శాఖలకు సంబంధించిన తదితర సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్య ఏ శాఖ పరిధిలోకి వస్తుందో, ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదని తహశీల్దార్ తెలిపారు.
