Home తాజా వార్తలు పట్టిచుకొని అధికారులు

పట్టిచుకొని అధికారులు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 12/1224
భైంసా పట్టణ కేంద్రంలో తిరుగుతున్న విధి కుక్కలు.
పట్టణంలో గుంపులు గుంపులుగా సంచారం.
పట్టించుకోని అధికారులు.*
వీధి కుక్కలను అదుపు చేసేవారు లేకపోవడంతో ప్రతీ. గ్రామంతో సహా పట్టణంలో నిత్యం ఎక్కడో ఒకచోట చిన్నారులు, బాటసారులు, మూగజీవాలపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే భైంసా మండలంలోని చాలా గ్రామాల్లో వీధి కుక్కల కాటుకు గురైన వారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో పాటు ఇళ్ల దగ్గర పెంచుకుంటున్న పశువులు, గొర్రెలు, మేకలపై దాడి చేయడంతో చాలా వరకు మృత్యువాత పడ్డాయి. విషయం కి వెళ్తే నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో ముస్లిం షాది ఖానా, పరిసర ప్రాంతాల్లో వీధికుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, మహిళలు, రోజువారీ పనులకు వెళ్లే పౌరులు భయాందోళనలకు గురవుతున్నారు. వీధికుక్కల సంచరిస్తున్న వీధుల్లో పిల్లలకు ప్రమాదమే కాకుండా రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
గతంలో బైంసా మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టే వారిని పిలిపించి వీధి కుక్కలను పట్టించి దూర ప్రాంతాల్లో వదిలేశారు. ఆ సమయంలో తప్పిపోయి ఉన్న కొన్ని వీధి కుక్కల సంతతి ఈ ఐదేళ్లలో పెరిగిపోయింది.
వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా ఈ సమస్య నుంచి బయటపడాలని మున్సిపల్ కమిషనర్ భైంసాకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.

You may also like

Leave a Comment