కోరుట్ల నవంబర్ 08(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కోరుట్ల పట్టణంలో బుధవారం రోజున ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు కోరుట్ల ఆర్డీఓ కార్యాలయం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాఖలు చేశారు.
కోరుట్ల పట్టణంలో ని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం లో అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి గా బీఅర్ఎస్ పార్టీ నుండి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

బీజేపీ పార్టీ నుండి ధర్మపురి అరవింద్ అభ్యర్థి తరుపున నామినేషన్ దాఖలు చేసిన పార్టీ నాయకులు.

కాంగ్రెస్ పార్టీ నుండి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేసిన జువ్వడి నర్సింగ రావు.
పొత్తు నాగరజన్ (మన తెలంగణా రాష్ట్రసమితి),
ఆకుల హన్మండ్లు (ప్రజా సేన పార్టీ),
కొండా చంద్ర మాణిక్యం(ఇండిపెండెంట్) నుంచి
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.