Home తాజా వార్తలు ప్రభుత్వ అధికారులకు ఎవరూ డబ్బులు ఇవ్వద్దు

ప్రభుత్వ అధికారులకు ఎవరూ డబ్బులు ఇవ్వద్దు

by Telangana Express

పేట జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష
ఊట్కూర్ డిసెంబర్ 14 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నారాయణపేట జిల్లా
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దు: —-పని చేయడానికి పైసలు అడిగితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజల కోరినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణపేట
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా పనులు చేయడానికి డబ్బులు అడిగితే ఇవ్వరాదని నారాయణ పేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ప్రజలకు పని చేసేందుకే ప్రభుత్వ అధికారులు ఉన్నారని, కార్యాలయాల్లో ఎవరికి నయా పైసా కూడా ఇవ్వరాదని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష మాట్లాడుతూ.. అవినీతికి తావు ఇవ్వొద్దని, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలు పారదర్శకమైన సేవలను పొందాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నారాయణపేట లోని మున్సిపల్ కార్యాలయం, తహాసిల్దార్, రిజిస్టార్ కార్యాలయాలలో పాటు లేఅవుట్ అప్రూవల్ కోసం వెళ్ళిన వారి నుంచి ఆయా కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులతో పాటు జిల్లా అధికారులు సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఒకవేళ ఆయా కార్యాలయాల్లో పనిచేసే వారు ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులు, ఉద్యోగులతో తమ పనులు చేసుకోవాలన్నారు. పనులు చేసేందుకు ఎవరైనా అధికారులు, ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ జిల్లా ప్రజలను కోరారు..

You may also like

Leave a Comment