జుక్కల్ నవంబర్ 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ నూతన ఎస్ఐ గా శివకుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ సుధాకర్ లింగంపెట్ పోలిస్ స్టేషన్ కు బదిలీ పై వెళ్ళడంతో గంభీర్రావుపేట పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్ఐ శివకుమార్ నిజాంసాగర్ పోలిస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. దీంతో బుధవారం ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల నివారణలో ప్రజలు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు.