నారాయణగూడ (తెలంగాణ ఎక్ష్ప్రెస్స్) జూలై 26
నారాయణగూడలోని కేఎంఐటీలో నిర్వహించిన ధన్వంతరి అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, డాక్టర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడే మహోన్నతమైన సేవ చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణ నేపథ్యంలో వైద్య రంగంలో డబ్బు ప్రస్తావన పెరిగినప్పటికీ, ఎంతోమంది వైద్యులు తక్కువ పారితోషికంతో ప్రజా సేవకే అంకితమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
నారాయణగూడలోని కేఎంఐటీలో నిర్వహించిన ధన్వంతరి అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడే మహోన్నతమైన సేవ చేస్తున్నారని అన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చిన తర్వాత వైద్య రంగంలో డబ్బు గురించిన చర్చలు పెరిగినప్పటికీ, ఇప్పటికీ ఎంతోమంది వైద్యులు అతి తక్కువ పారితోషికంతో జీవితాంతం ప్రజా సేవనే ధ్యేయంగా కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో, తాను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు, సమాజమంతా భయాందోళనలకు గురైన పరిస్థితుల్లో వైద్యులు తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రజలకు ధైర్యం చెప్పి, చికిత్స అందించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు.
అలాంటి గొప్ప వైద్యులను ధన్వంతరి అవార్డులతో సత్కరించడం ఎంతో అభినందనీయమని, ఈ అవార్డులు వైద్యుల్లో మరింత సేవా స్ఫూర్తిని నింపి, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇంకా ఎక్కువ అంకితభావంతో పనిచేసేలా ప్రేరణ కలిగిస్తాయని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.




