బాన్స్ వాడ పట్టణంలోని హనుమాన్ మందిరం వ్యాయామశాల గణేష్ మండలి వద్ద గురువారం గణేష్ నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ విట్టల్ రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్ లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు నార్ల సురేష్ అధ్యక్షతన, కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తదనంతరం మాతా స్వాముల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగింది. మహా అన్నదాన కార్యక్రమానికి పట్టణ ప్రజలు, నాయకులు, మాతా స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. హనుమాన్ మందిరం వ్యాయామశాల గణేష్ మండలి అన్నదాతలుగా రుద్రంగి రజిని, మురళి గుప్తా నిలిచారు. అన్నదాతలుగా సేవలందించిన వారికి ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నార్ల ఉదయ్, సాగర్, కొత్తకొండ భాస్కర్, గురు వినయ్ కుమార్, సాయిరాం నరసన్న తదితరులు పాల్గొన్నారు.









