ఘట్కేసర్ ఏప్రిల్ 14(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ టౌన్లో డాక్టర్ బీ.అర్ అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి,అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు,నీలి రంగు జెండాలతో వీధులన్నీ కళకళలాడాయి,బీ.అర్.ఎస్ నాయకులు మున్సిపల్ ఛైర్మెన్ పావని జంగయ్య యాదవ మాట్లాడుతూ డాక్టర్ బీ.అర్ అంబేడ్కర్ రాజ్యాంగం వ్రాసింది అందరి కోసమని,విద్య ద్వారా ఎదైనా సాధించవచ్చని,కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆమె అన్నారు,ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సిలర్లు ,కో-ఆప్షన్ మెంబర్లు,మాజీ వార్డు మెంబర్లు,సర్పంచులు,ఎంపీటీసీ లు,వివిధ పార్టీల కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు ..