బోధన్ రూరల్,ఆగస్ట్ 16:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బి ఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీఅని, ప్రజలతో బిఆర్ఎస్ పార్టీ ది పేగు బంధమని.. ఇతర పార్టీలది ఓటు బంధమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ పట్టణంలోని ఎన్ఎస్ఎఫ్ క్రీడా మైదానంలో జరిగిన బిఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కులాలు , మతాల పేరుతో ప్రజలను విడగొట్టకుండా బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేపం పథకాలు అందించిందన్నారు. దేశంలో కొందరు కులాల పేరుతో విరగొడతారని, తెలంగాణలో మాత్రం ప్రతి కులానికి హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాలు కట్టడం తో పాటు అన్ని కులవృత్తులకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని తెలిపారు. 62 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పేదలకు, ముస్లింలకు ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణలోని ముస్లింలంతా కారు..కెసిఆర్ సర్కార్ తప్ప మరో విధంగా ఆలోచించడం లేదని తెలిపారు. బోధన్ ప్రజలకు సుదర్శన్ రెడ్డి చేసింది శూన్యమని అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోధన్ లో 152 చెరువులు బాగు చేసుకున్నామని తెలిపారు. పదేళ్ల ముందు బీడీ కార్మికులకు పెన్షన్ లు రాలేదని, కానీ ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలో పదివేల మంది బిడి కార్మికులకు పెన్షన్లు, 4500 డ్వాక్రా గ్రూపులకు 2600 కోట్లు రుణాలు అందించామని పేర్కొన్నారు. తెలంగాణలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రకటించామని, ప్రైవేట్ రంగంలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, జిల్లాలో ఐటీ హబ్ ప్రారంభించిన రోజున 250 మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు.10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని కార్యకర్తలు ధైర్యంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి గ్రామం నుండి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తరలి రావడం చూస్తుంటే షకీల్ విజయయాత్రల ఉందన్నారు. సౌమ్యుడైన ఎమ్మెల్యే షకీల్ ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్, అయేషా వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ అయేషా ఫాతిమా, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్,సీసీబీ డైరెక్టర్లు గిర్థావర్ గంగారెడ్డి, శరత్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, వైస్ చైర్మన్ షకీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహెల్, ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలతో పేగు బంధం ఉన్న పార్టీ బిఆర్ ఎస్
36