Home తాజా వార్తలు మత్తమాల సొసైటి పరిధిలో 192 మంది రైతులకు 62,80,275 రూపాయల రుణమాఫీ…ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్, సొసైటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

మత్తమాల సొసైటి పరిధిలో 192 మంది రైతులకు 62,80,275 రూపాయల రుణమాఫీ…ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్, సొసైటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల సొసైటిలో సభ్యత్వం కలిగి పంట రుణాలు తీసుకున్న 192 మంది రైతులకు పంట రుణ మాఫీ అయ్యిందని, ఉమ్మడి జిల్లాల డిసిసిబి డైరెక్టర్, సొసైటి చైర్మన్ కాసాల శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ పుల్గల పెంటయ్య తెలిపారు. బుధవారం సొసైటి కార్యాలయంలో చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సిఎం కేసీఆర్ సర్కార్ 2018 కంటే ముందు పంట రుణాలు తీసుకున్న రైతులకు లక్ష రూపాయల లోపు పంట రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఈ రుణ మాఫితో సొసైటి పరిధిలో సభ్యత్వం కలిగి ఉన్న 670 మంది రైతులకు గాను పంట రుణాలు తీసుకున్న 192 మంది రైతులకు 99,900 రూపాయల లోపు ఉన్న వారికి లబ్ధి కలిగిందన్నారు. వీరందరికీ కలిపి 62,80,275 రూపాయల రుణమాఫీ అయ్యిందని ఎల్లారెడ్డి సహకార బ్యాంకు మేనేజర్ సాయిలు తెలిపారన్నారు. 2021 సంవత్సరంలో 256 మంది రైతులకు మొదటి విడతలో 25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు 30,62,487 రూపాయల రుణ మాఫీ అయ్యిందని, ఇంకా 248 మంది రైతులకు సంబంధించి 80 లక్షల 75 వేల రూపాయలు రుణ మాఫీ కావల్సి ఉందని, త్వరలోనే వీరికి కూడా రుణమాఫీ అవుతోందని తెలిపారు. పంట రుణమాఫీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రైతు పక్షపాతి సిఎం కేసీఆర్ సర్కార్ కు రైతుల తరపున రుణ మాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు సొసైటి చైర్మన్ కాసాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో, సొసైటి వైస్ చైర్మన్ పద్మా రావు, సిబ్బంది ఉన్నారు.

You may also like

Leave a Comment