Home తాజా వార్తలు రాజాపూర్ లో గాలికుంటు వ్యాధులకు టీకాలు

రాజాపూర్ లో గాలికుంటు వ్యాధులకు టీకాలు

by V.Rajendernath

శంకరపట్నం,ఆగస్టు,16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) రాజాపూర్ గ్రామంలో 150 పాడి పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. మొలంగూర్ పశు వైద్యాధికారి మాధవరావు మాట్లాడుతూ ప్రతి పశువుకు గాలికుంటు, వ్యాధి నిరోధక టీకాలు మరియు నట్టల మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నేడు గద్దపాక గ్రామంలో టీకాలు వేస్తున్నట్లు తెలిపారు, ఈ అవకాశాన్ని పాడి పరిశ్రమ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎండి,ఆరిఫ్, అమీర్ ఖాన్, పశుమిత్ర సభ్యులు అనూష పాడి రైతులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment