ఎల్లారెడ్డి, ఆగస్టు 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ప్రతినెల మొదటి శనివారం భవ్ సార్ క్షత్రియ సమాజ్ సంఘం సమావేశం ఏర్పాటుకు తీర్మానం చేసినట్లు సంఘం అధ్యక్షులు రాజేందర్ నాథ్ వెల్లడించారు. బుధవారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణంలోని పోచమ్మ మందిరంలో సంఘం సమావేశం జరిగింది. ప్రతినెల సంఘం సభ్యత్వం విధిగా చెలించాలని, కష్ట సుఖాల్లో అందరూ సంఘటితంగా కలిసి ఉండాలన్నారు. సంఘం భవనం శంకుస్థాపన ఈ నెల 18న మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ చేస్తారని వెల్లడించారు.
ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఉక్కల్ కర్ రమేష్, ప్రతినిధులు ప్రకాష్ మహేందర్ కర్, మహేందర్ కర్ గోపాల్, గోజె గోపాల్, గోజె అమృత్, ఉక్కల్కర్ సంతోష్, మైత్రజ్ కర్ శ్రీనివాస్, పో టే శ్రీనివాస్, జాడే చంద్ర ప్రకాష్, మైత్రజ్ కర్ సతీష్, మైస్కార్ వెంకట్ రాం, ఉక్కల్కర్ శ్రీనివాస్ రావు, గోజె నరేష్, ఉక్కల్ కర్ చంద్ర ప్రకాష్, పోటే సంతక్ రావు, పోటే బాలకిషన్, మైత్రజ్ కర్ అరవింద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.