ప్రభుత్వం విధానం అనుసరించి కాంట్రాక్టు
ఎఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి
మంచిర్యాల, ఆగస్టు 16, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు) ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఎఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమ్మె జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలో ఏఎన్ఎంలు సమ్మె ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఐటియు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని రకాల కాంట్రాక్ట్ ఎఎన్ఎంలను రెగ్యులర్ చేయాలాని, అదేవిదంగా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోమాస ప్రకాష్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, పద్మ జిల్లా అధ్యక్షులు పద్మ, మంజుల జిల్లా కార్యదర్శి, మంజుల, ఏఎన్ఎంలు తులసి,రమ, సరిత, సత్యవతి, రాజేశ్వరి, విజయ తదితరులు పాల్గొన్నారు.