…….. వివరించిన లెక్చరర్,కవి, ఉమాశేషారావు వైద్య
బీబీపేట్ ఆగస్టు 16 :- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
నేటి నుంచే శ్రావణ మాసం ప్రారంభం.శ్రావణమాసం అంటే శుభ మాసం శ్రావణ మాసాన్ని ‘నభో ‘మాసం అని కూడా అంటారు. నబో అంటే ఆకాశమని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు ,శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైనపర్వదినాలు జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పోలాల అమావాస్య, నాగ చతుర్థి ,పుత్రాఏకాదశిమరియు దామోదర ద్వాదశిమొదలైనవి. శ్రావణమాసం” చంద్రుని” మాసం అని కూడా అంటారు. చంద్రు డు మనః కారకుడు. అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూసే మాసం ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రంలో ప్రభావం చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చారనుంచిజరగబోవు దుష్ఫలితాలనునివారించుటకు మంచికి కలిగించుటకు ధర్మాచారములను, పండుగలు ఆచరించడం నియమమైనది. పరమార్థం వైపు మనసులు తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త ఆరోగ్యముల నుండి తప్పించుకో నుటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణమాసంలోవచ్చేపండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం దీనిఉద్దేశం.శ్రావణ మాసంలోవచ్చే సోమ వారాల్లో ఉపవాసంఉండిశివునికిఅభిషేకం నిర్వహిస్తారుశ్రావణమంగళ వారం రోజు కొత్తగా పెళ్లయిన వారు ఐదు సంవత్సరాల వరకు మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తారు .శ్రీకృష్ణుడు ద్రౌపతిదేవికి ,నారదమునింద్రుడు సావిత్రి దేవికి ఉపదేశించిన వ్రతం ఇది .మంగళ గౌరీకటాక్షం వల్లస్త్రీలకువైధవ్యబాధఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. ఇందులో శ్రావణ శుక్రవారం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వస్తుంది. వరలక్ష్మీదేవినిపూజిస్తారుమహా విష్ణువు లోకాలు అన్నిటిని రక్షించేవాడుఈశక్తులన్నీఆయన ద్వారా ప్రసరించేవే ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనిషికిఅష్టైశ్వర్యాలుకలుగుతాయి శుక్రవారం నాడు పూజి స్తే ఇవన్నీ కలుగుతాయని “శ్రీ సూక్తం ” వివరిస్తుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో శ్రావణ శనివారాలు ఇంటిదైవాన్నిపూజిస్తేమంచిదని ధర్మశాస్త్రాలు చెప్తాయి మరో ముఖ్యమైన పండుగ శ్రావణ పౌర్ణమి ఈరోజు యజ్ఞోపవీతం ధరిస్తారు శ్రావణ పౌర్ణమి నాడు ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదల్చామో వారి ముంజేతికి కట్టబోయే రాఖి వల్ల రక్షణ లభిస్తుంది అని, సోదరత్వానికిప్రాతికగాపేర్కొంటారు.వైజ్ఞానికంగా కూడా ఈమాసంవర్షాలు,చల్లని వాతావరణం ఉండుట చేత మాoసఆహారంసులభంగాజీర్ణంకాదు.ఉపవాసాలు,శ్రవణంలోచేసేప్రసాదాలు,ప్రత్యేకవంటల్లోపోషకాలు పుష్కలంగా ఉంటాయి.శివుడు,విష్ణువు,లక్షిమి ప్రత్యేక దేవతలను ఆరాధించి మానసిక ఉల్లాసాన్ని పొందడమే కాకుండా పసుపు బొట్లు ,వహినాలు, ఒడి బియ్యం పోసుకోవడం,శుభకార్యక్రమాలకు నెలవు ఈ శ్రావణ మాసం.
శ్రావణ మాసం విశిష్టత
68
previous post