ఎల్లారెడ్డి, ఆగస్టు 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం, రాష్ట్ర పురపాలక, ఐ టీ శాఖ మంత్రి కేటిఆర్ ఈ నెల 14 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విచ్చేయ నున్న సందర్భంగా, శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంత్రి భారీ బహిరంగ సభ కోసం స్థానిక జీవదాన్ హై స్కూల్ ప్రక్కన ఏర్పాటు చేస్తున్న సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. స్టేజ్, గ్యాలరీ, ప్రాంగణ చదును పనులను పరిశీలించి పనులు వేగవంతంగా, ఎలాంటి అపశృతులకు తావు లేకుండా జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలని సభాస్థలి వర్కర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ వెంట గాంధారి ఏఎంసి చైర్మన్ సత్యం రావు, ఎల్లారెడ్డి సొసైటి చైర్మన్ ఏగుల నర్సింలు, తాడ్వాయి డిసిఎంఏస్ డైరెక్టర్ కపిల్ రెడ్డి, గాంధారి మాజీ జడ్పీటిసి తానాజి రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, కర్ణం అరవింద్ గౌడ్ తదితరులు ఉన్నారు.